
మిస్ ఇండియా పోటీల్లో
బెంగళూరు: ప్రతి ఏడాది ఎంతోమంది ముద్దుగుమ్మలు పోటీపడే ‘ఫెమినా మిస్ ఇండియా-2016’ పోటీ ల్లో బెంగళూరుకు చెందిన తెలుగు భామ సంజన కూడా పోటీదారుగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బెంగళూరులోని యలహంక ఓల్డ్ టౌన్‌లో నివసిస్తున్న గెడ్డం పరంధామనాయుడు, ఇంద్రావతి దంపతుల గారాలప ట్టి సంజన. వీరి స్వస్థలం చిత్తూరు జిల్లా ఐరాల మండ లం బొమ్మసముద్రం. కొన్నేళ్ల క్రితం వీరి కుటుంబం బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. బీఈ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సంజన అందాల పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఫెమినా మిస్‌ఇండియాపోటీల్లో దేశ వ్యాప్తం గా మొత్తం 15 వేల మంది నుంచి ఎంట్రీలు రాగా వారిలో నుంచి కేవలం 21 మంది మాత్రమే తుది పోటీలకు ఎంపికయ్యారు. ఇక దక్షిణాది ఫెమినా మిస్ ఇండియా-2016లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సంజన, మిస్ పర్‌ఫెక్ట్ బాడీ, మిస్ ర్యాంప్‌వాక్‌గా ఎంపికైంది. అందాల ప్రపంచంలో తారలా వెల గడంతో పాటు సమాజ సేవ చేయడంలోనూ ఎంతో ఆనందం లభిస్తుందని సంజన చెబుతున్నారు. ఇప్పటికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. ఈ నెల 9న ముంబయిలో జరగనున్న ఫైనల్స్‌లో సంజన తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.