
సాక్షి, హైదరాబాద్: సైప్రస్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. నికోసియాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల తరుణ్ రెడ్డి 20–22, 21–9, 11–21తో నాలుగో సీడ్ దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ తరుణ్ రెడ్డి 21–17, 21–10తో ఎనిమిదో సీడ్ ఒస్వాల్డ్ ఫంగ్ (ఇంగ్లండ్)పై, సెమీఫైనల్లో 21–14, 21–15తో రెండో సీడ్ జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై సంచలన విజయాలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment