డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
ఒడెన్స్: ఫైనల్‌కు చేరిన మొదటి ప్రయత్నంలోనే కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19-21, 12-21తో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 24,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
రన్నరప్ సింధు
Published Mon, Oct 19 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement