Denmark Open Super Series tournament
-
బ్యాడ్మింటన్‌కు వేళాయె!
ఒడెన్స్ (డెన్మార్క్): కరోనా వైరస్ కారణంగా మార్చి నెల రెండో వారం నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సందడి మొదలుకానుంది. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ జరగనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు లక్ష్య సేన్, అజయ్ జయరామ్, శుభాంకర్ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరైన సన్నాహాలు లేని కారణంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టోబీ పెంటీ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; జేసన్ ఆంథోనీ (కెనడా)తో శుభాంకర్; అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో అజయ్ జయరామ్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో లక్ష్య సేన్ ఆడనున్నారు. -
మాజీ నంబర్ వన్ కు ప్రణయ్ షాక్
న్యూఢిల్లీ: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం నమోదు చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో వరల్డ్ మాజీ నంబర్ వన్, ఏడో సీడ్ లీ చాంగ్ వుయ్ పై విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. ప్రణయ్ 21-17,11-21, 21-19 తేడాతో మలేషియా ఆటగాడు లీ చాంగ్ ను మట్టికరిపించాడు. తొలి గేమ్ ను పోరాడి గెలిచిన ప్రణయ్, రెండో గేమ్ ను కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్ లో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరవరకూ ఉత్కంఠభరితంగా సాగిన మూడో గేమ్ లో ప్రణయ్ 21-19 తో గెలిచి లీ చాంగ్ కు షాకిచ్చాడు. ఇక మరో పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. శ్రీకాంత్ 21-13, 8-21, 21-18 తేడాతో కొరియా ఆటగాడు జియన్ హైయిక్ జిన్ పై గెలిచి క్వార్టర్స్ కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 22-20, 21-13 తేడాతో నిచాన్ జింద్ పాల్ పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ ను కష్టపడి గెలిచిన సైనా.. రెండో గేమ్ ను సునాయాసంగా చేజిక్కించుకుని క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. -
రన్నరప్ సింధు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ఒడెన్స్: ఫైనల్‌కు చేరిన మొదటి ప్రయత్నంలోనే కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19-21, 12-21తో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 24,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.