సార్‌బ్రుస్‌కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ మాళవిక 10–21, 15–21తో ప్రపంచ 36వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూసింది.
మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల మాళవికకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 70 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌గా నిలువడం మాళవికకు ఇది రెండోసారి. 2022లో జరిగిన సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు చేతిలో ఓడిపోయి మాళవిక రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment