
స్టుట్‌గార్ట్: మెర్సిడెస్ కప్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ బ్రూనో సొరెస్ (బ్రెజిల్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 19,680 యూరోల (రూ. 15 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment