Bopanna pair
-
రన్నరప్ బోపన్న జంట
స్టుట్గార్ట్: మెర్సిడెస్ కప్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 3–6తో టాప్ సీడ్ బ్రూనో సొరెస్ (బ్రెజిల్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 19,680 యూరోల (రూ. 15 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్స్‌లో దివిజ్–బోపన్న జంట
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ దివిజ్ శరణ్–రోహన్ బోపన్న (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బోపన్న ద్వయం 6–1, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డోవా)–మాలిక్ జజిరీ (ట్యూని షియా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో లియాండర్ పేస్ (భారత్)–మిగుయెల్ వరేలా (మెక్సికో) ద్వయం 6–3, 6–4తో మరేరో (స్పెయిన్)–కాస్టిలో (చిలీ) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లో దివిజ్–బోపన్న జోడీతో పోరుకు సిద్ధమైంది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్ ముందంజ వేయగా... అర్జున్ ఖడే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో రామ్‌కుమార్ 4–6, 6–4, 6–3తో మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై నెగ్గగా... అర్జున్ ఖడే 5–7, 6–7 (6/8)తో లాస్లో జెరీ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్ నుంచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని కాలి గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
జోడి రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ స్వర్ణం
-
ఏషియన్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం ఆరో రోజు ఆటలో భాగంగా భారత్ తన పతకాల వేటను కొనసాగిస్తోంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడి రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ ద్వయం విజయం సాధించి స్వర్ణాన్ని సాధించింది. తుది పోరులో బోపన్న జంట 2-0 తేడాతో బబ్లిక్- డెనిస్(కజికిస్తాన్)జోడిపై గెలిచి పసిడితో మెరిసింది. తొలి సెట్‌ను 6-3 తేడాతో గెలిచిన బోపన్న జోడి.. రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకుని మ్యాచ్‌తో పాటు స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. షూటింగ్లో మరో కాంస్యం షూటింగ్లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. ఈరోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధు కాంస్యాన్ని సాధించారు. ఓవరాల్‌గా 198.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నారు. దాంతో భారత్ పతకాల సంఖ్య 23కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు ఆరో రోజు ఆటలో పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మరో కాంస్యాన్ని సాధించింది. కాగా, పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్లో భారత్ పసిడితో మెరిసింది. టీమ్ ఈవెంట్లో భారత రోయర్లు సవరణ్ సింగ్, దత్తు భోకనల్, ఓం ప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లు స్వర్ణాన్ని సాధించారు. ఫైనల్స్‌లో వీరు 6;17;13 సెకన్లలో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి స్వర్ణాన్ని సాధించారు. ఏ దశలోనూ అలసటకు లోను కాకుండా తొలి స్థానంలో నిలిచారు. దాంతో రోయింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. -
బోపన్న జంటకు టైటిల్
న్యూఢిల్లీ: ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం 7–6 (9/7), 6–7 (4/7), 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)–సామ్ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది. 37 ఏళ్ల బోపన్న ఈ ఏడాది సాధించిన మూడో డబుల్స్ టైటిల్ ఇది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 16వ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు ఫ్రాన్స్‌లో జరిగిన బ్రెస్ట్ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో దివిజ్ శరణ్ (భారత్)–స్కాట్ క్లేటన్ (బ్రిటన్) ద్వయం 4–6, 5–7తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–అంటోనియో సాన్సిచ్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. -
తొలి రౌండ్లోనే బోపన్న జంట ఓటమి
షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–3, 3–6, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)–లుకాస్ పుయి (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. గంటలో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఆరు ఏస్‌లు సంధించింది. రెండు జంటలు చెరో సెట్ గెల్చుకున్నాక నిర్ణాయక టైబ్రేక్‌లో మాత్రం బోపన్న–క్యువాస్ ద్వయం తడబడింది. తొలి రౌండ్లోనే ఓడిన బోపన్న జంటకు 12,100 డాలర్ల (రూ. 7 లక్షల 88 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సన్నద్ధం కాకుండానే...
* ‘రియో’లో పేస్-బోపన్న జంట * వైఫల్యంపై భూపతి అభిప్రాయం ముంబై: ఎలాంటి సన్నాహాలు లేకుండా రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకే లియాండర్ పేస్-రోహన్ బోపన్న జంట తొలి రౌండ్లోనే నిష్కమ్రించిందని భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అభిప్రాయపడ్డాడు. ‘పేస్-బోపన్న కలసి సాధన చేయలేదు. మేమిద్దరం ఏథెన్‌స, బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడిన సమయంలో పలు టోర్నమెంట్లలో కలిసి ఆడాం. కానీ పేస్-బోపన్న అలా చేయలేదు. ఫలితంగా పురుషుల డబుల్స్‌లో పతకంపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జంటకు పతకం నెగ్గే అవకాశం లభించినా వదులుకున్నారు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా భూపతి వ్యాఖ్యానించాడు.