తొలి రౌండ్‌లోనే బోపన్న జంట ఓటమి | Bopanna pair lost in first round | Sakshi
Sakshi News home page

తొలి రౌండ్‌లోనే బోపన్న జంట ఓటమి

Published Wed, Oct 11 2017 12:02 AM | Last Updated on Wed, Oct 11 2017 12:02 AM

Bopanna pair lost in first round

షాంఘై ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–క్యువాస్‌ ద్వయం 6–3, 3–6, 5–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)–లుకాస్‌ పుయి (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది.

గంటలో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఆరు ఏస్‌లు సంధించింది. రెండు జంటలు చెరో సెట్‌ గెల్చుకున్నాక నిర్ణాయక టైబ్రేక్‌లో మాత్రం బోపన్న–క్యువాస్‌ ద్వయం తడబడింది. తొలి రౌండ్‌లోనే ఓడిన బోపన్న జంటకు 12,100 డాలర్ల (రూ. 7 లక్షల 88 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement