రన్నరప్ సౌరభ్ వర్మ | Badminton Saurabh Verma Runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్ సౌరభ్ వర్మ

Published Mon, Sep 19 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

రన్నరప్ సౌరభ్ వర్మ

రన్నరప్ సౌరభ్ వర్మ

న్యూఢిల్లీ: బెల్జియం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సౌరభ్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 19-21, 19-21తో ఐదో సీడ్ లుకాస్ కార్వీ (ఫ్రాన్‌‌స) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో సౌరభ్ 11-4తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడగా... కీలకదశలో లుకాస్ పైచేయి సాధించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్-శ్లోక్ రామచంద్రన్ జంట సెమీఫైనల్లో ఓడిపోయింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement