ఫైనల్లో సౌరభ్ వర్మ | Verma brothers reach finals of Bitburger Open | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సౌరభ్ వర్మ

Published Sun, Nov 6 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఫైనల్లో సౌరభ్ వర్మ

ఫైనల్లో సౌరభ్ వర్మ

బిట్‌బర్గర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

 సార్‌బ్రకెన్ (జర్మనీ): భారత యువ ఆటగాడు సౌరభ్ వర్మ బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అతని సోదరుడు, 12వ సీడ్ సమీర్ వర్మకు సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరభ్ 21-15, 21-18తో డెన్మార్క్‌కు చెందిన 15వ సీడ్ అండర్స్ అంటొన్సెన్‌ను కంగుతినిపించాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 23 ఏళ్ల సౌరభ్ జోరుకు అంటొన్సెన్ తలవంచాడు. తొలి గేమ్‌ను అలవోకగా గెలిచిన భారత ఆటగాడికి రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. అరుుతే సౌరభ్ పట్టుదలగా ఆడటంతో విజయం సొంతమైంది. మరో సెమీస్‌లో సమీర్ 18-21, 15-21తో నాలుగో సీడ్ షి యుకి (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సౌరభ్... షి యుకితో తలపడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement