లక్నో: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ సయ్యద్ మోదీ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ భమిడిపాటి సాయిప్రణీత్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 2116, 2220తో ఇస్కందర్ జుల్కర్‌నైన్ (మలేసియా)పై... శ్రీకాంత్ 2112, 2111తో మల్కోవ్ (రష్యా)పై... ప్రణయ్ 1821, 2220, 2113తో లి షి ఫెంగ్ (చైనా)పై... సౌరభ్ వర్మ 2111, 2116తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందారు. హైదరాబాద్ కుర్రాడు సిరిల్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సిరిల్ వర్మ 1221, 2115, 213తో హువాంగ్ పింగ్ సెయిన్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 1621, 821తో కున్లావుత్ వితిత్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు.
వృశాలి, ఉత్తేజిత ఓటమి
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తెలుగమ్మాయిలు గుమ్మడి వృశాలి 1621, 1621తో అష్మిత చాలిహా (భారత్) చేతిలో... సాయి ఉత్తేజిత 1021, 2119, 1521తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడారు.
సాత్విక్‌చిరాగ్ జంటకు షాక్
పురుషుల డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్ జోడీ, రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి (భారత్) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. డి జి జియాన్‌వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 2112, 2321తో సాత్విక్‌చిరాగ్ జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డిఅశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 2113, 1621, 2119తో ఎన్జీ సాజ్ యావుయువెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జంటపై నెగ్గింది.
సాయిప్రణీత్ శుభారంభం
Published Thu, Nov 28 2019 5:56 AM | Last Updated on Thu, Nov 28 2019 5:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment