
సాక్షి, హైదరాబాద్: కోట్ డి ఐవరీ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్న మెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ ఫైనల్లోకి ప్రవేశించింది. ఐవరీకోస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకృష్ణప్రియ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 21–16, 21–19తో అజోక్ అడ్సోకన్ (నైజీరియా)పై నెగ్గింది. శ్రీకృష్ణప్రియ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–2, 21–4తో నఫీసాతు (ఐవరీకోస్ట్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–17, 21–17తో దోహా హ్యానీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment