sri krishna priya
-
రన్నరప్ శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్ : కోట్ డి ఐవరీ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. ఐవరీకోస్ట్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 82వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 17–21, 13–21తో ప్రపంచ 101వ ర్యాంకర్ థెట్ తార్ తుజర్ (మయన్మార్) చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోని శ్రీకృష్ణప్రియ టైటిల్ పోరులో మాత్రం తడబడింది. తదుపరి శ్రీకృష్ణప్రియ ఈనెల తొమ్మిదిన మొదలయ్యే యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ఆమె కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది. -
ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: కోట్ డి ఐవరీ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్న మెంట్లో హైదరాబాద్ అమ్మాయి కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ ఫైనల్లోకి ప్రవేశించింది. ఐవరీకోస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకృష్ణప్రియ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 21–16, 21–19తో అజోక్ అడ్సోకన్ (నైజీరియా)పై నెగ్గింది. శ్రీకృష్ణప్రియ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–2, 21–4తో నఫీసాతు (ఐవరీకోస్ట్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–17, 21–17తో దోహా హ్యానీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్లు కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో టాప్‌సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో ఐదో సీడ్ శ్రీకృష్ణ ప్రియ 21–15, 21–18తో నున్టకర్న్ ఎమ్‌సార్డ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో రసిక రాజే (భారత్) 21–19, 21–16తో చెంగ్ యింగ్ మయ్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో సమీర్ వర్మ, ప్రతుల్ జోషి, గురుసాయిదత్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్‌వర్మ (భారత్) 21–14, 21–9తో కెవిన్ అరోకియా వాల్టేర్ (భారత్)పై, గురుసాయిదత్ 21–14, 21–13తో డేనియల్ ఫరీద్ (భారత్)పై గెలుపొందగా... ఐదోసీడ్ సౌరభ్ వర్మ 21–14, 13–21, 19–21తో ప్రతుల్ జోషి చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో చిరాగ్ సేన్ 16–21, 18–21తో అబ్దుల్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, సిక్కిరెడ్డి తమ భాగస్వాములతో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–10, 22–20తో యెంగ్ షింగ్ చోయ్– ఫాన్ కా యాన్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరుకుంది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–17తో బగాస్ మౌలానా–ప్రెంకీ విజయ పుత్ర (ఇండోనేసియా) జోడీపై, కోన తరుణ్ (భారత్)–లిమ్ ఖిమ్ వా (మలేసియా) జంట 21–23, 24–22, 22–20తో సుపక్ జోమ్కో–వచిరవిట్ సోథాన్ (థాయ్‌లాండ్) జోడీలపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో గారగ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంట 16–21, 18–21తో నాలుగో సీడ్ అరుణ్ జార్జ్–సన్యం శుక్లా జోడీ చేతిలో, విష్ణువర్ధన్ గౌడ్–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ జంట 10–21, 15–21తో అక్బర్ బింటాంగ్–మోహ్ రిజా పహ్లెవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన–పూర్విషా రామ్ జంట 21–17, 21–9తో కావ్య గుప్తా–ఖుషి గుప్తా జోడీపై నెగ్గి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. -
భారత జట్టులో శ్రీకృష్ణప్రియ
న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయ జూనియర్ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ అమ్మాయి కుదురవల్లి శ్రీకృష్ణప్రియకు తగిన ప్రతిఫలం లభించింది. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళల సీనియర్ జట్టులో 20 ఏళ్ల శ్రీకృష్ణప్రియ ఎంపికైంది. స్టార్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్, మరో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని సింగిల్స్ విభాగంలోని ఇతర సభ్యులు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకృష్ణప్రియ 58వ స్థానంలో ఉంది. డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్పలతోపాటు ప్రాజక్తా సావంత్, సంయోగిత, రితూపర్ణ దాస్, మిథిల బరిలోకి దిగుతారు. భారత పురుషుల జట్టు సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలకు చోటు లభించింది. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, మనూ అత్రి, సుమీత్ రెడ్డి, శ్లోక్ రామచంద్రన్, ఎం.ఆర్.అర్జున్‌లను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలోని అలోర్ సెటార్ పట్టణంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. భారత్‌తోపాటు చైనా, మలేసియా, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, సింగపూర్, చైనీస్ తైపీ, కజకిస్తాన్, మాల్దీవులు, నేపాల్, ఫిలిప్పీన్స్ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ప్రతి పోటీలో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లు మే 20 నుంచి 27 వరకు బ్యాంకాక్‌లో జరిగే థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. -
శ్రీకృష్ణప్రియ ఓటమి
లెయువెన్ (బెల్జియం): గతవారం ఫోర్జా ఖార్కివ్ అంతర్జాతీయ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ యువతార శ్రీకృష్ణప్రియ బెల్జియం ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో రెండో రౌండ్లో నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ శ్రీకృష్ణప్రియ 13–21, 11–21తో జూలీ జాకబ్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ చుక్కా సాయిఉత్తేజిత రావు తొలి రౌండ్లో 21–15, 16–21, 10–21తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ శ్రుతి ముందాడ చేతిలో ఓటమి చవిచూసింది. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ
♦ తొలి రౌండ్లో నాలుగో సీడ్‌పై విజయం ♦ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ తైపీ: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా నెహ్వాల్ స్ఫూర్తితో మరో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుకుంది. చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 19 ఏళ్ల శ్రీకృష్ణప్రియ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 79వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 21–17, 20–22, 21–9తో నాలుగో సీడ్, ప్రపంచ 28వ ర్యాంకర్ చియాంగ్ మీ హుయ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది. 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేముల్లో గట్టిపోటీ ఎదుర్కొన్న శ్రీకృష్ణప్రియ నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆరంభంలోనే 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరును కొనసాగించి తన ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ విదేశీ గడ్డపై ఓ గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో భారత్‌లో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో షువో యున్ సంగ్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో 7–21, 17–21తో నా యోంగ్ కిమ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ కుర్రాడు సిరిల్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. రెండో రౌండ్లో సిరిల్ వర్మ 16–21, 21–17, 21–17తో చియా హావో లీ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత్‌కే చెందిన అభిషేక్ 17–21, 21–17, 6–21తో సెయోంగ్ హూన్ వూ (కొరియా) చేతిలో, హర్షీల్ డాని 12–21, 6–21తో హా యంగ్ వూంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. -
సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఏపీఎండీసీ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకృష్ణ ప్రియ, రీతుపర్ణ ఫైనల్లోకి ప్రవేశించారు. కడపలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ (తెలంగాణ) 21-15, 21-15తో నేహా పండిట్ (మహారాష్ట్ర)పై, రీతుపర్ణ దాస్ (తెలంగాణ) 21-18, 19-21, 21-15తో సారుు ఉత్తేజిత రావు (ఏపీ)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో రాహుల్ యాదవ్ (తెలంగాణ) 19-21, 21-18తో అభిషేక్ యెలిగర్ (కర్ణాటక)పై, డేనియల్ ఫరీద్ (కర్ణాటక) 26-24, 21-19తో హర్షిత్ అగర్వాల్ (కర్ణాటక)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించారు. మహిళల డబుల్స్ సెమీస్‌లో అపర్ణ బాలన్ (పీఈటీ)- ఆరతి సారా సునీల్ (కేరళ) జోడీ 21-17, 21-18తో అనురా ప్రభుదేశాయ్ (ఏఏఐ)-కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో శ్రుతి-హరిత (కేరళ) జోడీ 21-15, 21-13తో వైష్ణవి- శ్రుతి (మహారాష్ట్ర) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది.