సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ | sri krishna priya enters final in all india rankings badminton tourny | Sakshi
Sakshi News home page

సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ

Published Sun, Nov 20 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ

సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ

ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ


సాక్షి, హైదరాబాద్: ఏపీఎండీసీ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శ్రీకృష్ణ ప్రియ, రీతుపర్ణ ఫైనల్లోకి ప్రవేశించారు. కడపలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకృష్ణప్రియ (తెలంగాణ) 21-15, 21-15తో నేహా పండిట్ (మహారాష్ట్ర)పై, రీతుపర్ణ దాస్ (తెలంగాణ) 21-18, 19-21, 21-15తో సారుు ఉత్తేజిత రావు (ఏపీ)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో రాహుల్ యాదవ్ (తెలంగాణ) 19-21, 21-18తో అభిషేక్ యెలిగర్ (కర్ణాటక)పై, డేనియల్ ఫరీద్ (కర్ణాటక) 26-24, 21-19తో హర్షిత్ అగర్వాల్ (కర్ణాటక)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించారు.

 

మహిళల డబుల్స్ సెమీస్‌లో అపర్ణ బాలన్ (పీఈటీ)- ఆరతి సారా సునీల్ (కేరళ) జోడీ 21-17, 21-18తో అనురా ప్రభుదేశాయ్ (ఏఏఐ)-కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో శ్రుతి-హరిత (కేరళ) జోడీ 21-15, 21-13తో వైష్ణవి- శ్రుతి (మహారాష్ట్ర) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement