
కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్ : కోట్ డి ఐవరీ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. ఐవరీకోస్ట్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 82వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 17–21, 13–21తో ప్రపంచ 101వ ర్యాంకర్ థెట్ తార్ తుజర్ (మయన్మార్) చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోని శ్రీకృష్ణప్రియ టైటిల్ పోరులో మాత్రం తడబడింది. తదుపరి శ్రీకృష్ణప్రియ ఈనెల తొమ్మిదిన మొదలయ్యే యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్‌లో బరిలోకి దిగనుంది. తొలి రౌండ్‌లో ఆమె కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment