ఫెడరర్ రికార్డు
ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్ రోజర్ ఫెడరర్ అలవోకగా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్ 6-2, 6-3, 7-5తో స్టీవ్ జాన్సన్ (అమెరికా)పై గెలిచాడు. వింబుల్డన్‌లో ఫెడరర్ క్వార్టర్స్‌కు చేరడం ఇది 14వ సారి కాగా... ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్‌లలో 48వ సారి. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో అత్యధిక మ్యాచ్‌లు (306) గెలిచిన మార్టినా నవ్రతిలోవా రికార్డును ఫెడరర్ సమం చేశాడు. ఈసారి స్విస్ స్టార్ ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా ఓడిపోకపోవడం విశేషం.
మరో ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో సిలిచ్ (క్రొయేషియా) 6-1, 5-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి నిషికోరి (జపాన్) గాయంతో వైదొలిగాడు. జొకోవిచ్‌ను ఓడించిన సామ్ క్వారీ (అమెరికా) 6-4, 7-6(5), 6-4తో మహుత్ (ఫ్రాన్స్)పై గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరాడు.