క్రికెట్ షాట్స్ ఆడుతున్న ఫెడరర్
లండన్ : వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ కదా.. క్రికెట్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? లేక వింబుల్డన్ పేరిట క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారా? అని అనుకుంటున్నారా? ఇలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది టెన్నిస్ కోర్టు మైదానంలో జరిగిందే. అవును రికార్డుస్థాయిలో ఎనిమిది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరరే కోర్టులో టెన్సిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్ షాట్ ఆడాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ సంధర్బంగా ఫెడరెర్ డిఫెన్స్ షాట్స్‌ను సాధన చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అభిమానులే కాదు వింబుల్డన్ అధికారిక ట్విటర్‌లో ఐసీసీని ట్యాగ్ చేస్తూ అధికారులు ట్వీట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అడ్రియన్ మనారినోపై అలవోకగా గెలిచాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్‌లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు.
Ratings for @rogerfederer's forward defence, @ICC?#Wimbledon pic.twitter.com/VVAt2wHPa4
— Wimbledon (@Wimbledon) July 9, 2018
Comments
Please login to add a commentAdd a comment