
భారత కుర్రాళ్లు కుమ్మేశారు..
ఫతుల్లా: ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్లో నమీబియాతో క్వార్టర్ ఫైనల్లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 349 పరుగులు సాధించింది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించి జట్టుకు భారీ స్కోరు అందించారు.
ఓపెనర్ ఆర్ఆర్ పంత్ (111) సెంచరీకి తోడు సర్ఫరాజ్ ఖాన్ (76), అర్మాన్ జాఫర్ (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. అన్మోల్ ప్రీత్ సింగ్ 41, లొమ్రోర్ 41 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్ కోయెట్జీ మూడు వికెట్లు పడగొట్టాడు.