క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్ | Saina Nehwal wins, P Kashyap and Manu Attri-Sumeeth Reddy lose in Macau Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్

Published Fri, Dec 2 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్

క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్

కశ్యప్ అవుట్
మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి 

మకావు: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రిలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో సారుు ప్రణీత్ కూడా క్వార్టర్స్‌కు చేరగా పారుపల్లి కశ్యప్‌కు నిరాశ ఎదురైంది. దినార్ ద్యా ఆయుస్టిన్ (ఇండోనేసియా)తో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సైనా 17-21, 21-18, 21-12 స్కోరుతో గెలిచింది. గాయం నుంచి కోలుకున్నాక పూర్తి ఫామ్ కోసం తంటాలు పడుతున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్ సైనాకు తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. 3-1తో ప్రత్యర్థి ఆధిక్యంలో ఉన్న దశలో సైనా 5-5తో స్కోరును సమం చేసింది. ఓ దశలో 11-7తో జోరు కనబరిచినప్పటికీ... వరుస పారుుంట్లతో రెచ్చిపోరుున ఆయుస్టిన్ తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ పోటీ ఎదురైనా సైనా స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది.

11-3 తో ముందంజలో ఉన్నా... వెంటనే పుంజుకున్న ఆయుస్టిన్ 18-18తో స్కోరును సమం చేసింది. అరుుతే ఈ దశలో నిలకడగా ఆడిన సైనా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత చివరి గేమ్‌లో పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవడంతో సైనా విజయం సులువైంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో తను చైనాకు చెందిన జాంగ్ రుుమన్‌తో తలపడుతుంది. పరుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సారుు ప్రణీత్ 21-15, 21-17తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో జావో జున్ పెంగ్ (చైనా)తో ఆడతాడు. మరో మ్యాచ్‌లో కశ్యప్ 13-21, 20-22తో లియ్ యు సీన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి జంట 20-22, 19-21తో డానీ బవా-హెండ్రా విజయ (సింగపూర్) చేతిలో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement