క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా | srikanth ,Saina Open tournament quarterfinals of the China | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా

Published Fri, Nov 14 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా

క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా

చైనా ఓపెన్ టోర్నీ
 
ఫుజౌ (చైనా): సొంతగడ్డపై చైనా క్రీడాకారులను ఓడించి... భారత ప్లేయర్స్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-17, 19-21, 21-14తో హువాన్ గావో (చైనా)ను ఓడించగా... కశ్యప్ 11-21, 21-11,21-13తో జుయ్ సాంగ్ (చైనా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-18, 21-18తో జింగ్‌జింగ్ కిన్ (చైనా)పై నెగ్గింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో కశ్యప్; కెంటో మొమొటా (జపాన్)తో శ్రీకాంత్; దీ సుయో (చైనా)తో సైనా తలపడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement