బెంగళూరు: ఎయిర్ ఆసియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్‌లోనూ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 6-4, 7-6 (11/9)తో డేల్ ప్రొపొజియా (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
ఆ తర్వాత తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ 7-6 (7/3), 6-1తో ఇగోర్ జెరసిమోవ్-ఇల్యా ఇవస్కా (బెలారస్) జంటపై గెలిచాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్-సుమీత్ నాగల్ (భారత్) జోడీ 6-7 (5/7), 4-6తో తి చెన్ (చైనీస్ తైపీ)-డేన్ ప్రొపొజియా (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది.
క్వార్టర్స్‌లో సాకేత్
Published Thu, Oct 22 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM
Advertisement
Advertisement