క్వార్టర్ ఫైనల్లో సానియా జంట | Sania Mirza in Quarter-final | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సానియా జంట

Published Wed, Sep 28 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

క్వార్టర్ ఫైనల్లో సానియా జంట

క్వార్టర్ ఫైనల్లో సానియా జంట

న్యూఢిల్లీ: వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో  మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో 3-6, 6-3, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా)-మారియా జోస్ మార్టినెజ్ శాంచెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన సానియా జంట రెండో సెట్‌లో పుంజుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లోనూ పైచేరుు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
 
 బోపన్న జోడీ శుభారంభం: చైనాలోనే జరుగుతున్న చెంగ్డూ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న-జీవన్ జంట 6-2, 6-4తో ఫెలిసియానో లోపెజ్ (స్పెరుున్)-యువాన్ మొనాకో (అర్జెంటీనా) జోడీపై గెలిచింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement