ఆసియా బాస్కెట్‌బాల్ క్వార్టర్స్‌లో భారత్
చాంగ్‌షా (చైనా): ఆసియా సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో 12 ఏళ్ల తర్వాత భారత జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 65-99 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున విశేష్ భృగువంశీ 21 పాయింట్లు, అమృత్‌పాల్ సింగ్ 18 పాయింట్లు, అమ్‌జ్యోత్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశారు.
లీగ్ దశ పోటీలు ముగిశాక భారత్, పాలస్తీనా ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఇ’లో సమఉజ్జీగా నిలిచాయి. అయితే ముఖాముఖి మ్యాచ్‌లో పాలస్తీనాపై భారత్ గెలుపొందడంతో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్ నుంచి ఫిలిప్పీన్స్, ఇరాన్, జపాన్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి.