Basketball Championship
-
భారత బాస్కెట్‌బాల్ జట్టులో ఆర్యన్
ఆసియా కప్ అండర్–16 బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన ఆర్యన్ శర్మకు చోటు లభించింది. ఈ టోర్నీ ఈనెల 17 నుంచి 24 వరకు ఖతర్ రాజధాని దోహాలో జరుగుతుంది. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన ఆర్యన్ శర్మ భారత కోచ్ పీఎస్ సంతోష్ ఆధ్వర్యంలో కీస్టోన్ బాస్కెట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటాడు. ఈ టోరీ్నలో రాణిస్తే భారత జట్టు వచ్చే ఏడాది జూలైలో తుర్కియేలో జరిగే ప్రపంచకప్ అండర్–17 టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. -
Basketball Championship: రన్నరప్ తెలంగాణ
National Basketball Championship Runner Up Telangana- చెన్నై: జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 82–131 పాయింట్ల తేడాతో ఇండియన్ రైల్వేస్ జట్టు చేతిలో ఓడిపోయింది. రైల్వేస్ తరఫున పూనమ్ చతుర్వేది (26 పాయింట్లు), దర్శిని (19 పాయింట్లు), పుష్ప (19 పాయింట్లు), మధు కుమారి (16 పాయింట్లు) అదరగొట్టారు. తెలంగాణ తరఫున అన్బారసి (20 పాయింట్లు), ప్రియాంక (20 పాయింట్లు), అశ్వతి థంపి (18 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పురుషుల ఫైనల్లో తమిళనాడు 87–69తో పంజాబ్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. చదవండి: IPL 2022: స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నో జోరుకు బ్రేక్! -
రన్నరప్ దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే మహిళల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టు రాణించింది. దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ సంఘం (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ లో జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో సౌత్ వెస్ట్రన్ రైల్వే 69–64తో దక్షిణ మధ్య రైల్వేపై గెలుపొందింది. సదరన్ రైల్వే జట్టుకు మూడోస్థానం దక్కింది. జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్‌కు చెందిన మొత్తం 12 జట్లు టైటిల్కోసం తలపడ్డాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతి థిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సెయింట్ పీటర్స్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ జట్లు రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాయి. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో అండర్–13 బాలుర, అండర్–16 బాలికల విభాగంలో సెయింట్ పీటర్స్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. శుక్రవారం జరిగిన అండర్–16 బాలికల ఫైనల్లో సెయింట్ పీటర్స్ 28–8తో డీఆర్ఎస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. విజేత జట్టు తరఫున అర్చన ‘మోస్ట్ వ్యా ల్యుబుల్ ప్లేయర్’ అవార్డును అందుకోగా, డీఆర్ఎస్ ప్లేయర్ విభి ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్’ పురస్కారాన్ని గెలుచుకుంది. బాలుర విభాగంలో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 59–58తో సెయింట్ పీటర్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అండర్–13 బాలుర టైటిల్‌పోరులో సెయింట్ పీటర్స్ 27–15తో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూ ల్ను ఓడించింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రూ. 8000, రన్నరప్‌లకు రూ. 5000 ప్రైజ్‌మనీగా లభించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ పీటర్స్ చైర్మన్ బాల్‌రెడ్డి విజేత జట్లకు ట్రోఫీలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. -
విజేత కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ జట్టు
సాక్షి, హైదరాబాద్: శామ్యూల్ వసంత్ కుమార్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బేగంపేట్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో కస్టమ్స్ జట్టు 78–66తో ఎయిర్ బార్న్ క్లబ్‌పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 37–32తో ఆధిక్యంలో ఉన్న కస్టమ్స్ జట్టు చివరి వరకు అదే జోరును కొనసాగించి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత జట్టు తరఫున చంద్రహాస్ 24 పాయింట్లతో చెలరేగగా, విజయ్ కుమార్ (13) అతనికి చక్కని సహకారం అందించాడు. ఎయిర్‌బార్న్ తరఫున నరేశ్ (20), టోని (23) చివరి వరకు పోరాడారు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఎయిర్‌బార్న్ క్లబ్ 65– 64తో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై గెలుపొందింది. ఎయిర్‌బార్న్ జట్టులో నరేశ్ (23), అభిలాష్ (13), జాక్ (10)... వైఎంసీఏ తరఫున డెన్నిస్ సెహగల్ (12), ముస్తఫా (14), వరుణ్ (14) రాణించారు. మరో సెమీస్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ 90–73తో ఈగల్స్‌ను ఓడించింది. కస్టమ్స్ జట్టులో వినయ్ యాదవ్ (18), విజయ్ కుమార్ (20), చంద్రహాస్ (19)... ఈగల్స్ తరఫున అమన్ (30), దత్త (15), రోహన్ (17) ఆకట్టుకున్నారు. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శి టి. శేష్ నారాయణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర అకాడమీ చైర్మన్ కె. ప్రవీణ్ రాజు పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్బీఏ టోర్నీకి ప్రతీక్, హర్ష్
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జూనియర్ ఎన్బీఏ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ‘స్లేట్ ది స్కూల్’ విద్యార్థులు గోన ప్రతీక్, హర్ష్ కర్వా ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని జేపీ అట్లాంటిస్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఏప్రిల్ 29 నుంచి మే 22 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇదే కాకుండా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగే బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంపుకు కూడా ప్రతీక్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్లేట్ ది స్కూల్ చైర్మన్ అమర్నాథ్ వాసిరెడ్డి ప్రతీక్‌ను అభినందించారు. జట్ల వివరాలు పురుషులు: జి. ప్రతీక్, హర్ష్, హరిద్వారకేశ్, సిద్ధార్థ్ గంగరాజు, కె. సర్దానా, సాయి కిషోర్, అక్షిత్ రెడ్డి, అన్మోల్ పవార్, భవాని ప్రసాద్, ఎమ్మాన్యుయేల్, పి. నవీన్ కుమార్ (కోచ్). మహిళలు: అర్షియా త్యాగి, కె. శ్రీయ, రేఖ, అమూల్య, అసలత్ సుల్తానా, యశస్విని, లోరెట్టా శరణ్ రాబర్ట్, జియా ధావల్ సుతార్, శ్రేయ, పాల్య గుడిపాడి. -
దక్షిణాసియా బాస్కెట్‌బాల్ టోర్నీ విజేత భారత్
మాలె: దక్షిణాసియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకుంది. మంగళవారం నేపాల్ జట్టుతో జరిగిన చివరిదైన నాలుగో లీగ్ మ్యాచ్‌లో భారత్ 90–44 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున విశేష్ భృగువంశీ 22 పాయింట్లు, అనిల్ కుమార్ 16 పాయింట్లు స్కోరు చేశారు. ఐదు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి విజేతగా అవతరించింది. భారత్‌కు ఈ టైటిల్ లభించడం ఆరోసారి కావడం విశేషం. గతంలో భారత్ 2012, 2013, 2014, 2015, 2016లలో చాంపియన్‌గా నిలిచింది. -
ఆసియా బాస్కెట్‌బాల్ క్వార్టర్స్‌లో భారత్
చాంగ్షా (చైనా): ఆసియా సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో 12 ఏళ్ల తర్వాత భారత జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 65-99 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున విశేష్ భృగువంశీ 21 పాయింట్లు, అమృత్‌పాల్ సింగ్ 18 పాయింట్లు, అమ్‌జ్యోత్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశారు. లీగ్ దశ పోటీలు ముగిశాక భారత్, పాలస్తీనా ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఇ’లో సమఉజ్జీగా నిలిచాయి. అయితే ముఖాముఖి మ్యాచ్‌లో పాలస్తీనాపై భారత్ గెలుపొందడంతో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్ నుంచి ఫిలిప్పీన్స్, ఇరాన్, జపాన్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి.