దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ టోర్నీ విజేత భారత్‌ | India thump Nepal 90-44 in South Asian basketball championship | Sakshi
Sakshi News home page

దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ టోర్నీ విజేత భారత్‌

Published Wed, May 24 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

India thump Nepal 90-44 in South Asian basketball championship

మాలె: దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకుంది. మంగళవారం నేపాల్‌ జట్టుతో జరిగిన చివరిదైన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 90–44 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరఫున విశేష్‌ భృగువంశీ 22 పాయింట్లు, అనిల్‌ కుమార్‌ 16 పాయింట్లు స్కోరు చేశారు. ఐదు జట్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి విజేతగా అవతరించింది. భారత్‌కు ఈ టైటిల్‌ లభించడం ఆరోసారి కావడం విశేషం. గతంలో భారత్‌ 2012, 2013, 2014, 2015, 2016లలో చాంపియన్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement