సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ జట్లు రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాయి. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో అండర్–13 బాలుర, అండర్–16 బాలికల విభాగంలో సెయింట్ పీటర్స్ జట్లు చాంపియన్‌లుగా నిలిచాయి. శుక్రవారం జరిగిన అండర్–16 బాలికల ఫైనల్లో సెయింట్ పీటర్స్ 28–8తో డీఆర్‌ఎస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. విజేత జట్టు తరఫున అర్చన ‘మోస్ట్ వ్యా ల్యుబుల్ ప్లేయర్’ అవార్డును అందుకోగా, డీఆర్‌ఎస్ ప్లేయర్ విభి ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్’ పురస్కారాన్ని గెలుచుకుంది.
బాలుర విభాగంలో డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 59–58తో సెయింట్ పీటర్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అండర్–13 బాలుర టైటిల్‌పోరులో సెయింట్ పీటర్స్ 27–15తో డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూ ల్‌ను ఓడించింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రూ. 8000, రన్నరప్‌లకు రూ. 5000 ప్రైజ్‌మనీగా లభించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ పీటర్స్ చైర్మన్ బాల్‌రెడ్డి విజేత జట్లకు ట్రోఫీలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment