inter school basketball
-
సెయింట్ పీటర్స్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ జట్లు రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాయి. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో అండర్–13 బాలుర, అండర్–16 బాలికల విభాగంలో సెయింట్ పీటర్స్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. శుక్రవారం జరిగిన అండర్–16 బాలికల ఫైనల్లో సెయింట్ పీటర్స్ 28–8తో డీఆర్ఎస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. విజేత జట్టు తరఫున అర్చన ‘మోస్ట్ వ్యా ల్యుబుల్ ప్లేయర్’ అవార్డును అందుకోగా, డీఆర్ఎస్ ప్లేయర్ విభి ‘మోస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్’ పురస్కారాన్ని గెలుచుకుంది. బాలుర విభాగంలో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 59–58తో సెయింట్ పీటర్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అండర్–13 బాలుర టైటిల్‌పోరులో సెయింట్ పీటర్స్ 27–15తో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూ ల్ను ఓడించింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రూ. 8000, రన్నరప్‌లకు రూ. 5000 ప్రైజ్‌మనీగా లభించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ పీటర్స్ చైర్మన్ బాల్‌రెడ్డి విజేత జట్లకు ట్రోఫీలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. -
ఫైనల్లో ఆండ్రూస్, ఓక్రిడ్జ్
జింఖానా, న్యూస్‌లైన్: దేవసియా స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ బాలుర జట్టు ఆటగాడు జియాన్ (23) చెలరేగడంతో ఆ జట్టు 49-42తో ఫ్యూచర్ కిడ్స్ జట్టుపై గెలిచింది. సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్, ఫ్యూచర్ కిడ్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆండ్రూస్ జట్టు 25-18తో ముందంజలో ఉంది. అనంతరం ఫ్యూచర్ కిడ్స్ జట్టు ఆటగాళ్లు శివ సాయివర్మ (12), ఆకర్ష్ (11) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆండ్రూస్ ఆటగాళ్లు జియాన్, డేవిడ్ (12), అశుతోష్ (6) వీరోచితంగా పోరాడటంతో ఆ జట్టు నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 22-8తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై గెలుపొందింది. మ్యాచ్ మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి 15-6తో ఓక్రిడ్జ్ ఆధిక్యంలో ఉంది. కార్తీక్ (17), శేష (3) రాణించారు. ఈ రోజు జరగబోయే ఫైనల్స్‌లో సెయింట్ ఆండ్రూస్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ జట్లు పోటీపడనున్నాయి. బాలికల సెమీఫైనల్స్ ఫ్యూచర్ కిడ్స్: 15 (ఆషిత 5); సెయింట్ జోసెఫ్ హైస్కూల్: 3 చిరెక్ పబ్లిక్ స్కూల్: 17 (సన్హిత 7, సంబ్రీన్ 6); సెయింట్ పాయిస్ హైస్కూల్: 7 (పూజా నాయుడు 4).