జింఖానా, న్యూస్‌లైన్: దేవసియా స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ బాలుర జట్టు ఆటగాడు జియాన్ (23) చెలరేగడంతో ఆ జట్టు 49-42తో ఫ్యూచర్ కిడ్స్ జట్టుపై గెలిచింది. సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్, ఫ్యూచర్ కిడ్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆండ్రూస్ జట్టు 25-18తో ముందంజలో ఉంది.
అనంతరం ఫ్యూచర్ కిడ్స్ జట్టు ఆటగాళ్లు శివ సాయివర్మ (12), ఆకర్ష్ (11) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆండ్రూస్ ఆటగాళ్లు జియాన్, డేవిడ్ (12), అశుతోష్ (6) వీరోచితంగా పోరాడటంతో ఆ జట్టు నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 22-8తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై గెలుపొందింది. మ్యాచ్ మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి 15-6తో ఓక్రిడ్జ్ ఆధిక్యంలో ఉంది. కార్తీక్ (17), శేష (3) రాణించారు. ఈ రోజు జరగబోయే ఫైనల్స్‌లో సెయింట్ ఆండ్రూస్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ జట్లు పోటీపడనున్నాయి.
బాలికల సెమీఫైనల్స్
ఫ్యూచర్ కిడ్స్: 15 (ఆషిత 5); సెయింట్ జోసెఫ్ హైస్కూల్: 3 చిరెక్ పబ్లిక్ స్కూల్: 17 (సన్హిత 7, సంబ్రీన్ 6); సెయింట్ పాయిస్ హైస్కూల్: 7 (పూజా నాయుడు 4).
ఫైనల్లో ఆండ్రూస్, ఓక్రిడ్జ్
Published Thu, Oct 24 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement