భారత బాస్కెట్‌బాల్‌ జట్టులో ఆర్యన్‌ | Aryan in the Indian basketball team | Sakshi
Sakshi News home page

భారత బాస్కెట్‌బాల్‌ జట్టులో ఆర్యన్‌

Published Wed, Sep 13 2023 1:16 AM | Last Updated on Wed, Sep 13 2023 1:16 AM

Aryan in the Indian basketball team - Sakshi

ఆసియా కప్‌ అండర్‌–16 బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణకు చెందిన ఆర్యన్‌ శర్మకు చోటు లభించింది. ఈ టోర్నీ ఈనెల 17 నుంచి 24 వరకు ఖతర్‌ రాజధాని దోహాలో జరుగుతుంది. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి అయిన ఆర్యన్‌ శర్మ భారత కోచ్‌ పీఎస్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో కీస్టోన్‌ బాస్కెట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటాడు. ఈ టోరీ్నలో రాణిస్తే భారత జట్టు వచ్చే ఏడాది జూలైలో తుర్కియేలో జరిగే ప్రపంచకప్‌ అండర్‌–17 టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement