
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే మహిళల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జట్టు రాణించింది. దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ సంఘం (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ లో జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.
సోమవారం జరిగిన ఫైనల్లో సౌత్ వెస్ట్రన్ రైల్వే 69–64తో దక్షిణ మధ్య రైల్వేపై గెలుపొందింది. సదరన్ రైల్వే జట్టుకు మూడోస్థానం దక్కింది. జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్‌కు చెందిన మొత్తం 12 జట్లు టైటిల్‌కోసం తలపడ్డాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్‌సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతి థిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment