రికార్డు సృష్టిస్తారా... | Euro 2016 quarter-final previews | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టిస్తారా...

Jul 3 2016 2:04 AM | Updated on Sep 4 2017 3:59 AM

రికార్డు సృష్టిస్తారా...

రికార్డు సృష్టిస్తారా...

సొంతగడ్డపై జరుగుతున్న యూరోలో ఇప్పటివరకూ నిలకడగా ఆడిన ఫ్రాన్స్... పసికూన ఐస్‌లాండ్‌తో క్వార్టర్

ఐస్‌లాండ్‌తో ఫ్రాన్స్ క్వార్టర్స్ పోరు నేడు
  రా. గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 పారిస్: సొంతగడ్డపై జరుగుతున్న యూరోలో ఇప్పటివరకూ నిలకడగా ఆడిన ఫ్రాన్స్... పసికూన ఐస్‌లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయిం ది. ఈసారి టైటిల్ గెలవడం ద్వారా మూడుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని ఫ్రాన్స్ ఆరాటపడుతోంది.
 
 మరోవైపు కేవలం 3.3 లక్షల జనాభా ఉన్న ఐస్‌లాండ్ ప్రి క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ను కంగుతినిపించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ జట్టుపై అంచనాలు లేనందున ఒత్తిడి కూడా పెద్దగా లేదు. ఫ్రాన్స్ మాత్రం సొంతగడ్డపై ఆడుతున్నందున కొంత ఒత్తిడిలో ఉంది. ఫ్రాన్స్ స్టార్ గ్రిజ్‌మెన్ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ చేశాడు. మరోసారి తనే కీలకం అయ్యే అవకాశం ఉంది. అటు ఐస్‌లాండ్ సిగర్డ్‌సన్‌ను నమ్ముకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement