Euro 2016
-
ఈపిల్ టవర్ వద్ద 40మంది అరెస్టు
పారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన యూరో 2016 ఫైనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అల్లర్లు సృష్టించాలని అనుకున్న 40మందిని పారిస్ పోలీసులు అరెస్టు చేశారు. వారందరికి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. తాము విధించిన నిబంధనలు అతిక్రమించి వ్యవహరించడమే కాకుండా పోలీసులను సైతం లెక్కచేయని విధంగా వ్యవహరించారని, ఒక భయానక పరిస్థితిని సృష్టించారని పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. అరెస్టయిన వారిలో పోర్చుగల్ వారు, పారిస్ కు చెందినవారు ఉన్నారని అన్నారు. ఇంకొందరి కోసం గాలింపులు చేపడతున్నామని చెప్పారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. ఫ్యాన్ జోన్ లోకి అనుమతించలేదని ఇరు దేశాలకు చెందిన కొంతమంది యువకులు ఆందోళన చేపట్టడంతోపాటు వాటర్ బాటిల్స్, చెప్పులు విసరడం, రాళ్లు విసరడంలాంటివి చేశారు. ఇదంతా ఈఫిల్ టవర్ దగ్గర చోటుచేసుకుంది. ఇదికాస్త పెద్దదయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారిని టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్-రష్యా మ్యాచ్ సమయంలో ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న రచ్చరచ్చగా మారిన విషయం తెలిసిందే. -
వేల్స్ వండర్
యూరోలో సెమీస్‌కి... క్వార్టర్స్‌లో 3-1తో బెల్జియంపై విజయం యూరో కప్ అరంగేట్రంలోనే వేల్స్ జట్టు అనూహ్య రీతిలో అదరగొడుతోంది. ఇప్పటిదాకా తాము సాధించిన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ ఏకంగా ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టించింది. స్టార్ ఫుట్‌బాలర్ గ్యారెత్ బేల్ మెరుపులు మెరిపించకున్నా సమష్టి ఆటతీరుతో అన్ని విభాగాల్లో రాణించిన వేల్స్ సగర్వంగా సెమీఫైనల్లోకి ప్రవేశించి కొత్త చరిత్రను సృష్టించుకుంది. లిల్లే: ఓ పెద్ద టోర్నీలో 58 ఏళ్ల తర్వాత ఆడుతున్న వేల్స్ జట్టు ఎవరి అంచనాలకూ అందని రీతిలో యూరో కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. మిడ్‌ఫీల్డర్ హల్ రాబ్సన్ కను కళ్లుచెదిరే గోల్ సహా యంతో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఫేవరెట్ బెల్జియంపై 3-1తో వేల్స్ నెగ్గింది. వేల్స్ నుంచి అష్లే విలియమ్స్ (31వ నిమిషంలో), రాబ్సన్ (55), వోక్స్ (86) గోల్స్ చేయగా బెల్జియం నుంచి రడ్జా నైన్గోలన్ (13) ఏకైక గోల్ సాధించాడు. 2014 ప్రపంచకప్‌లోనూ బెల్జియం క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈనెల 6న పోర్చుగల్‌తో జరిగే సెమీఫైనల్లో వేల్స్ తలపడుతుంది. తమ సరిహద్దుకు కేవలం వంద కి.మీ దూరంలోనే ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్‌ను తిలకించేందుకు బెల్జియం నుంచి ఏకంగా లక్షా 50 వేల మంది లిల్లే నగరానికి వచ్చారు. స్టేడియంలో మెజారిటీ అభిమానుల మద్దతుతో ఆరంభంలో బెల్జియం చెలరేగి ఆడింది. మ్యాచ్ తొలి 20 నిమిషాలు బెల్జియందే హవా నడిచింది. ఈ సమయంలో థామస్ మునియర్, యానిక్ కరాస్కో, ఈడెన్ హజార్డ్ గోల్స్ ప్రయత్నాలు తృటిలో తప్పాయి. అయితే 13వ నిమిషంలో హజార్డ్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రడ్జా 30 గజాల దూరం నుంచి టాప్ లెఫ్ట్ కార్నర్ ద్వారా బెల్జియం కు ఆధిక్యాన్నిచ్చాడు. ఈ షాక్ నుంచి త్వరగానే కోలుకున్న వేల్స్ 31వ నిమిషంలో స్కోరును సమం చేసింది. ఆరోన్ రామ్సే రైట్ వింగ్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను అష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ చేసి జట్టులో సంతోషం నింపాడు. ఇక ఇక్కడి నుంచి బెల్జియం వ్యూహాలు ఏమాత్రం పనిచేయలేదు. ముఖ్యంగా వీరి బ్యాక్‌లైన్ సమన్వయలోపాన్ని వేల్స్ సొమ్ము చేసుకుంది. ద్వితీయార్ధం 55వ నిమిషంలో ఔరా అనే రీతిలో రాబ్సన్ చేసిన వరల్డ్ క్లాస్ గోల్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లిష్ సెకండ్ టైర్ క్లబ్లో ఆడే ఈ ఆటగాడు... రామ్సే క్రాస్‌ను అందుకుని పెనాల్టీ ఏరియాలో బెల్జియం ముగ్గురు డిఫెండర్లను వెనక్కీ ముందుకు ఏమార్చుతూ బంతిని అతి వేగంగా నెట్లోకి పంపడంతో వేల్స్ సంబరాలు మిన్నంటాయి. అనంతరం 64వ నిమిషంలో బెల్జియంకు ఫ్రీకిక్ లభించినా వినియోగించుకోలేకపోయింది. 75వ నిమిషంలో ఆరోన్ రామ్సే ఎల్లో కార్డ్ అందుకోవడంతో తను సెమీస్‌కు దూరం కానున్నాడు. ఇక చివర్లో క్రిస్ గుంటర్ ఇచ్చిన క్రాస్ షాట్‌ను గాల్లోనే అందుకున్న వోక్స్ తలతో చేసిన గోల్‌తో వేల్స్ ఆధిక్యం మరింత పెరిగింది. ఇంజ్యూరీ సమయంలో హజార్డ్ ప్రయత్నాలు విఫలం కావడంతో బెల్జియం పరాజయం ఖాయమైంది. 1ఓ మేజర్ టోర్నీలో సెమీస్‌కు చేరడం వేల్స్‌కు ఇదే తొలిసారి 2 స్వీడన్ (1992లో) అనంతరం అరంగేట్రంలోనే సెమీస్‌కు చేరిన రెండో జట్టు వేల్స్. 3ఈ మ్యాచ్‌లో వేల్స్ తరఫున గోల్స్ చేసిన ముగ్గురూ ఇంగ్లండ్‌లోనే జన్మించారు -
రికార్డు సృష్టిస్తారా...
ఐస్‌లాండ్‌తో ఫ్రాన్స్ క్వార్టర్స్ పోరు నేడు రా. గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: సొంతగడ్డపై జరుగుతున్న యూరోలో ఇప్పటివరకూ నిలకడగా ఆడిన ఫ్రాన్స్... పసికూన ఐస్‌లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయిం ది. ఈసారి టైటిల్ గెలవడం ద్వారా మూడుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని ఫ్రాన్స్ ఆరాటపడుతోంది. మరోవైపు కేవలం 3.3 లక్షల జనాభా ఉన్న ఐస్లాండ్ ప్రి క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ను కంగుతినిపించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ జట్టుపై అంచనాలు లేనందున ఒత్తిడి కూడా పెద్దగా లేదు. ఫ్రాన్స్ మాత్రం సొంతగడ్డపై ఆడుతున్నందున కొంత ఒత్తిడిలో ఉంది. ఫ్రాన్స్ స్టార్ గ్రిజ్మెన్ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ చేశాడు. మరోసారి తనే కీలకం అయ్యే అవకాశం ఉంది. అటు ఐస్లాండ్ సిగర్డ్సన్ను నమ్ముకుంది.