ప్రపంచ మహిళల బాక్సింగ్ టోర్నీ
అస్తానా (కజకిస్తాన్): సీనియర్ స్థాయిలో తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. మంగళవారం జరిగిన 54 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 0-3తో పియాపియో (చైనా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాతెర్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోగా... సవీటి బోరా (81 కేజీలు), సర్జూబాలా దేవి (48 కేజీలు), సీమా పూనియా(+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు.
సోనియా 3-0తో అనెతా రిగిల్‌స్కా (పోలండ్)పై విజయం సాధించగా... సవీటి 0-3తో ఎలిఫ్ గునెరి (టర్కీ) చేతిలో, సర్జూబాలా 0-3తో నజిమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో, సీమా 0-3తో లజత్ కుంగ్‌బయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.
క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్
Published Wed, May 25 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement
Advertisement