క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ | Copa America: Brazil through to quarter-finals - Al Jazeera English | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్

Published Tue, Jun 23 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్

క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్

సాంటియాగో: నిషేధం కారణంగా కెప్టెన్ నెయ్‌మర్ లేకపోయినా... సమష్టిగా ఆడిన బ్రెజిల్ జట్టు కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో వెనిజులాను ఓడించి గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. బ్రెజిల్ తరఫున థియాగో సిల్వా (9వ నిమిషంలో), రొబెర్టో ఫిర్మినో (51వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... వెనిజులాకు నికొలస్ ఫెడరో 84వ నిమిషంలో ఏకైక గోల్‌ను అందించాడు. నాలుగు మ్యాచ్‌ల నిషేధం కారణంగా ఇక కోపా అమెరికా కప్‌లో ఆడే అవకాశం లేని నెయ్‌మార్‌కు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామని సిల్వా తెలిపాడు.
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్
జూన్ 24: చిలీ  =ఉరుగ్వే
జూన్ 25: బొలివియా=  పెరూ
జూన్ 26: అర్జెంటీనా = కొలంబియా
జూన్ 27: బ్రెజిల్ = పరాగ్వే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement