లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ బ్రెజిల్ జట్టు కథ ముగిసింది. ‘షూటౌట్’ ద్వారా ఫలితం తేలిన క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వే 4–2తో బ్రెజిల్ జట్టును ఓడించి 2011 తర్వాత ఈ టోరీ్నలో మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్స్ చేయలేదు.
‘షూటౌట్’లో ఉరుగ్వే తరఫున నలుగురు ప్లేయర్లు వల్వెర్డె, బెంటాన్‌కర్, అరాసెటా, ఉగార్టె... బ్రెజిల్ తరఫున ఇద్దరు ప్లేయర్లు పెరీరా, మారి్టనెల్లి గోల్స్ సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్లో కొలంబియా 5–0తో పనామా జట్టు ను ఓడించింది. బుధవారం జరిగే తొలి సెమీఫైన ల్లో కెనడాతో అర్జెంటీనా; గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వేతో కొలంబియా ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment