కోపా అమెరికా కప్
టెముకో (చిలీ): అంతా తానై ఆడిన కెప్టెన్ నెమార్ కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో పెరూ జట్టుపై విజయం సాధించింది. 23 ఏళ్ల వయస్సులోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నెమార్ ఆట ఐదో నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేయడంతోపాటు... ఇంజ్యూరీ టైమ్‌లో (90+2వ నిమిషంలో) సహచరుడు డగ్లస్ కోస్టా గోల్ చేసేందుకు తోడ్పడ్డాడు.
నెమార్ అద్వితీయ ఆటతీరు కారణంగా ‘డ్రా’ చేసుకోవాల్సిన మ్యాచ్‌ను బ్రెజిల్ జట్టు విజయం తో ముగించింది. ఆట మూడో నిమిషంలోనే క్యూ వా చేసిన గోల్‌తో పెరూ 1-0 ఆధిక్యంలోకి వెళ్లిం ది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లోనే ఆ విరైంది. ఐదో నిమిషంలో కుడివైపు నుంచి డానీ అల్వెస్ కొట్టిన క్రాస్ పాస్‌ను డి బాక్స్ ముందున్న నెమార్ తలతో గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఈ గోల్‌తో నెమార్ అంతర్జాతీయ కెరీర్‌లో 44 గోల్స్ చేసినట్టయింది. బ్రెజిల్ దిగ్గజం పీలే 24 ఏళ్ల వయస్సులో 44 గోల్స్ చేయగా... నెమార్ 23 ఏళ్లకే ఈ ఘనత సాధించడం విశేషం.
మరోవైపు ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో వెనిజులా 1-0తో కొలంబియా జట్టుపై నెగ్గి సంచలనం సృష్టించింది. 60వ నిమిషంలో సాలమన్ రాన్‌డాన్ గోల్‌తో వెనిజులా ఆధిక్యంలోకి వెళ్లింది.
బ్రెజిల్‌ను గెలిపించిన నెమార్
Published Tue, Jun 16 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM
Advertisement