కోపా అమెరికా కప్ ఫైనల్లో కొలంబియా
చార్లోటి (నార్త్ కరోలినా): రెండోసారి కోపా అమెరికా కప్ చాంపి యన్‌గా నిలిచేందుకు కొలంబియా జట్టు విజయం దూరంలో నిలిచింది. గతంలో 15 సార్లు చాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వే జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా సొలిస్ గోల్ చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొలంబియా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది.
తొలి అర్ధభాగం చివర్లో కొలంబియా ప్లేయర్ మునోజ్ రెడ్ కార్డుకు గురై మైదా నం వీడాడు. దాంతో రెండో అర్ధభాగం మొత్తం కొలంబియా పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో ఉరుగ్వే 62 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా కొలంబియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయడంలో విఫలమైంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా ఆడుతుంది. 1975లో తొలిసారి ఈ టోరీ్నలో ఫైనల్ చేరిన కొలంబియా రన్నరప్‌గా నిలువగా ... 2001లో రెండోసారి ఫైనల్ ఆడి తొలి టైటిల్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment