కుట్టి పద్మిని సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించిది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైన నటులతో కలిసి నటించింది. ఆమె నటనకు తమిళనాడు రాష్ట్రం జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్న తొలినటిగా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పద్మిని మాట్లాడూతూ.. 'అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అప్పట్లో సావిత్రి, జమున ఉన్న సమయం. అప్పట్లో దర్శకులు కొంచెం అడ్జస్ట్‌మెంట్లు చేస్తారా అని అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. నాకు గ్లామర్ డ్రెస్ అంటే ఇష్టముండదు. అలాంటి డ్రెస్సులు నాకు నచ్చవు. నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. అలా కొన్ని సినిమాలు మిస్సయ్యా. హీరోయిన్‌గా చాలా అవకాశాలు వదులుకున్నా. నాకన్న శ్రీదేవి బాగా ఫేమస్ అయింది. ఆ అదృష్టం నాకు రాలేదు.' అని అన్నారు.
అనంతరం పద్మిని మాట్లాడూతూ.. 'కానీ నేను ఇప్పుడు రోజు 140 మందికి జీతాలు ఇస్తున్నా. ఎవరెవరు నాకు అవకాశం ఇవ్వలేదో వారికే నేను ఉపాధి కల్పించా. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఎవరైతే నన్ను రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలని పిలిచారో వారికే సాయం చేస్తున్నా. నేను బాగున్నానంటే నేను చేసిన పనులే. నా భర్త పెళ్లయిన 22 ఏళ్ల తర్వాత నా సెక్రెటరీని లవ్ చేశారు. పెళ్లయి పిల్లలు కన్నాక సడన్‌గా భర్తపై కోపం ఎలా వస్తుంది. నేను అడ్జస్ట్ చేసుకుని ఉండాలి లేదా ఒంటరిగా ఉండాలి. నేను ఒంటరిగానే ఉంటున్నా. చాలా సంతోషంగా ఉన్నా' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment