chess champion ship
-
‘బ్లిట్జ్’ చాంపియన్ అర్జున్
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ టోర్నీ బ్లిట్జ్ ఈవెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు. పది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 19 ఏళ్ల అర్జున్ 12.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. 10 గేముల్లో గెలిచిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని మరో మూడు గేముల్లో ఓడిపోయాడు. 11.5 పాయింట్లతో నకముర (అమెరికా) రెండో స్థానంలో, 9.5 పాయింట్లతో షఖిర్యార్ (అజర్బైజాన్) మూడో స్థానంలో నిలిచారు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ ఈవెం ట్లో అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బ్లిట్జ్ ఈవెంట్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 18 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లు సాధించింది. ఎనిమిది గేముల్లో గెలిచిన హారిక, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. ర్యాపిడ్ ఈవెంట్లోనూ హారికకు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన వైశాలి 13.5 పాయింట్లతో బ్లిట్జ్ ఈవెంట్లో టైటిల్ దక్కించుకోగా, మరియా (ఉక్రెయిన్) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలి చింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. విజేత వైశాలికి 7,500 డాలర్లు (రూ. 6 లక్షల 10 వేలు), మూడో స్థానంలో నిలిచిన హారికకు 3 వేల డాలర్లు (రూ. 2 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెన్నై: ఆసియా ఆన్లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్‌పై... ఎనిమిదో మ్యాచ్‌లో 2.5–1.5తో కజికిస్తాన్‌పై... తొమ్మిదో మ్యాచ్‌లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్‌తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిస్తాన్‌తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి. -
ఈ సారి ‘సోచి’లో...
ఆనంద్-కార్ల్సెన్ పోరు మాస్కో: విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రీ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. రష్యాలోని ‘సోచి’లో నవంబర్ 7నుంచి 28 వరకు వీరిద్దరు ప్రపంచ కిరీటం కోసం పోటీ పడతారు. వేదికను ప్రకటిస్తూ ‘ఫిడే’ అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్, ఈ మెగా ఈవెంట్ కోసం 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 18 కోట్లు) బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య మ్యాచ్‌లు ఒలింపిక్ విలేజ్‌లో జరుగుతాయి. దీనికి ఇద్దరు ఆటగాళ్లూ అంగీకరించారు. గత ఏడాది నవంబరులో ఆనంద్, తన వరల్డ్ టైటిల్‌ను కార్ల్సెన్కు కోల్పోయాడు. అయితే ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి మరో సారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించాడు. -
భారత్‌కు మూడు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రాణిం చారు. మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు మరో రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు నెగ్గారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో శనివారం ముగిసిన ఈ పోటీల్లో ఎనిమిది పతకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అండర్-16 బాలుర విభాగంలో కార్తికేయన్ మురళీ (చెన్నై) స్వర్ణం, గిరీశ్ కౌశిక్ (మైసూర్) రజతం సాధించారు. అండర్-8 బాలుర విభాగంలో ప్రజ్ఞానంద (చెన్నై) చాంపియన్ అయ్యాడు. అండర్-10 బాలికల విభాగంలో సైనా సోలంకి (ఒరిస్సా) టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-12 బాలుర విభాగంలో రఘునందన్ (బెంగళూరు) రజతం దక్కించుకున్నాడు. వైభవ్ (ఢిల్లీ, అండర్-18 బాలురు); సి.లక్ష్మీ (చెన్నై, అండర్-10 బాలికలు), భాగ్యశ్రీ (మహారాష్ట్ర, అండర్-8 బాలికలు) కాంస్యాలు నెగ్గారు. ఈ పోటీల్లో 123 దేశాల నుంచి 1,818 క్రీడాకారులు పాల్గొన్నారు.