భారత్‌కు మూడు స్వర్ణాలు | india got three gold medals in cheass tournment | Sakshi
Sakshi News home page

భారత్‌కు మూడు స్వర్ణాలు

Published Sun, Dec 29 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

india got three gold medals in cheass tournment

న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రాణిం చారు. మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు మరో రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు నెగ్గారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో శనివారం ముగిసిన ఈ పోటీల్లో ఎనిమిది పతకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
 
 అండర్-16 బాలుర విభాగంలో కార్తికేయన్ మురళీ (చెన్నై) స్వర్ణం, గిరీశ్ కౌశిక్ (మైసూర్) రజతం సాధించారు. అండర్-8 బాలుర విభాగంలో ప్రజ్ఞానంద (చెన్నై) చాంపియన్ అయ్యాడు. అండర్-10 బాలికల విభాగంలో సైనా సోలంకి (ఒరిస్సా) టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-12 బాలుర విభాగంలో రఘునందన్ (బెంగళూరు) రజతం దక్కించుకున్నాడు. వైభవ్ (ఢిల్లీ, అండర్-18 బాలురు); సి.లక్ష్మీ (చెన్నై, అండర్-10 బాలికలు), భాగ్యశ్రీ (మహారాష్ట్ర, అండర్-8 బాలికలు) కాంస్యాలు నెగ్గారు. ఈ పోటీల్లో 123 దేశాల నుంచి 1,818 క్రీడాకారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement