సాక్షి, ముంబై: గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన టాటాసన్స్, జెట్‌డీల్‌కు రంగం సిద్ధమైంది. ఈ వార్తలను ధృవీకరించిన టాటా సన్స్ ఈ కొనుగోలు సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన టాటా సన్స్‌బోర్డు ఆమోదం తెలిపిందనీ అయితే ఇంతరవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బోర్డు సభ్యులందరూ సమావేశ ముగింపు తర్వాత విలేఖరులతో మాట్లాడడానికి నిరాకరించారు. తాజా పరిణామంతో జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.
తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తలు ఇటీవల మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైందని మీడియాలో ఊహాగానాలు ఊపందుకున‍్న సంగతి తెలిసిందే.
సంక్షోభంలో ఇరుక్కున్న జెట్ ఎయిర్‌వేస్‌ను కాపావాలని టాటా సన్స్‌ను ప్రభుత్వం కోరిందని బ్లూమ్‌బెర్గ్ వ్యాఖ్యానించింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్‌ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ సుముఖంగా ఉన్నప్పటికీ, సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మాత్రం కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చినట్లు మరో కథనం. కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా, జెట్‌కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన టాటా సన్స్ బోర్డు సమావేశం టాటా-జెట్ డీల్ పై అంచనాలను మరింత పెంచింది.
మరోవైపు ఇవి పూర్తిగా ఊహాజనిత వార్తలని నిన్న (గురువారం) జెట్ ఎయిర్‌వేస్ కొట్టిపారేసింది. దీనిపై ఎలాంటి చర్చలూ,నిర్ణయాలు లేవని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా జెట్ ఎయిర్‌వెస్‌లో అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ 24శాతం వాటా ఉండగా ఉండగా, వ్యవస్థాపకుడు గోయల్‌కు 51 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment