నేడు ఏపీపీఎస్‌సీ ప్రిలిమినరి పరీక్ష
Published Sat, Jun 24 2017 10:17 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
- దరఖాస్తుదారులు 3,663 మంది
- ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష
- కర్నూలులో 7 సెంటర్లు ఏర్పాటు
కర్నూలు(అగ్రికల్చర్): అసిస్టెంట్ బీసీ, ట్రైబల్, సోషల్ వెల్పేర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్‌సీ ఆదివారం ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్షకు 3,663 మంది హాజరుకానున్నారు. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్‌సీ అధికారులు మరళీమోహన్, నాగరాజు తెలిపారు. కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు తహసీల్దార్లను లైజన్ ఆఫీసర్లుగా, ప్రతి సెంటరుకు ఒక డిప్యూటీ తహసీల్దారును అసిస్టెంటు లైజన్ ఆఫీసర్‌గా నియమించారు. కర్నూలులో సెయింట్ జోషప్ డిగ్రీ కళాశాల, మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం హైస్కూల్, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, బి.క్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(ఫర్ మెన్), శ్రీకృష్ణ జూనియర్ కళాశాల, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ సూళ్లలో మొత్తంగా 7 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9.45 తర్వాత అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్‌సీ అధికారులు అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు.
Advertisement