న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు 2.19 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. మెట్రో, మోచీ, వాక్‌వే తదితర బ్రాండ్ల ఫుట్‌వేర్ కంపెనీ ప్రీఐపీవో ప్లేస్‌మెంట్‌కింద రూ. 10 కోట్లను సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు వెల్లడించింది. 1955లో మెట్రో బ్రాండుతో తొలిసారి ముంబైలో స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు సైతం పెట్టుబడులున్నాయి. 2021 మార్చికల్లా కంపెనీ దేశవ్యాప్తంగా 134 పట్టణాలలో 586 స్టోర్లను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment