
సాక్షి, నాగ్‌పూర్ : సొంత పార్టీ బీజేపీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పిన నానా పటోలే ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రధాని మోదీ ఓబీసీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓబీసీ కార్డులతో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతూ వారిని కూడా సొంత మేలుకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
రైతులపట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగానే తాను లోక్‌సభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని, ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరి అనుసరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. ప్రతిసారి ఓబీసీలను ఉపయోగించుకుంటున్న మోదీ వారికి చేస్తుంది మాత్రం ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తాను ఒక నీచ జాతి నుంచి వచ్చినట్లు చెప్పుకున్నారు. దీంతోనే తనకు మోదీ ద్వంద్వ వైఖరిపట్ల ఆగ్రహం వేసి ఎంపీ పదవికి రాజీనామా చేశాను. మోదీ చేసిన వాగ్దానాలను అటు కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నెరవేర్చలేదు' అని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment