
ముంబై: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలో జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే, ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సమావేశాల వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఆయన తెలిపారు.
యూటీగా ముంబై!
కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని విభజించడంతో పాటు ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలనే ఎజెండాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీతో సహా ఏ పక్షంతో కూడా సంప్రదింపులు చేయకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు.
అప్పుడెందుకు ప్రత్యేక సమావేశాల్లేవ్..
ఇదే సమయంలో కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కోవిడ్-19 సంక్షోభం, మణిపూర్ హింసాకాండ వంటి అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందన్నారు. అటువంటి నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టి, ఇక్కడి సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిస్తోందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కుట్రలో భాగంగా బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీని తరలించాలనే ప్లాన్‌లో మోదీ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!
Comments
Please login to add a commentAdd a comment