ఇదే కాంగ్రెస్‌ సంస్కృతి : కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..ఆపై.. | Nana Patole Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇదే కాంగ్రెస్‌ సంస్కృతి : కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్‌ చీఫ్‌

Published Tue, Jun 18 2024 7:51 PM | Last Updated on Tue, Jun 18 2024 8:11 PM

Nana Patole Video Viral On Social Media

ముంబై: మహరాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకోవడమే అందుకు కారణమైంది.

నానా పటోలే మహరాష్ట్ర అకోలా జిల్లాలోని వాడేగావ్‌ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి తన కార్లో కూర్చున్నారు. అయితే ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా పటోలే పర్యటించిన ప్రాంతం బురదమయమైంది. బురద కాళ్లను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు తేవాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తను పురమాయించారు. సదరు కార్యకర్త నీళ్లు తెచ్చి పటోలే పాదాల్ని శుభ్రం చేశారు.

ఇదే కాంగ్రెస్‌ సంస్కృతి
పార్టీ కార్యకర్త తన బురద పాదాలను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో నానా పటోలేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కాంగ్రెస్‌ సంస్కృతి అంటూ ముంబై బీజేపీ ట్వీట్‌లను షేర్‌ చేసింది.  

‘దురదృష్టకరం ఏమిటంటే, పార్టీ కోసం ప్రాణాలను అర్పించే కార్యకర్తలను పదేపదే అవమానిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కార్యకర్తతో తన బురదకాళ్లను కడిగించుకోవడం సిగ్గుచేటు ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? అని ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ చర్యను షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులది నవాబీ, ఫ్యూడల్‌ మనస్తత్వం అని దుయ్యబట్టారు.

 కాంగ్రెస్‌ది ఫ్యూడల్ మనస్తత్వం
కాంగ్రెస్‌ది ఫ్యూడల్ మనస్తత్వం. వారు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లాగా చూస్తారు. తాము రాజులమనుకుంటారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్‌ నేతలు ఇలా ప్రవర్తిస్తే ఒక వేళ అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటారో ఆలోచించండి. అందుకే కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి’ అని పూనావాలా అన్నారు.

నేను రైతు బిడ్డని 
కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్న ఘటన వివాదం కావడంతో నానా పటోలే స్పందించారు. నేను రైతు బిడ్డను. బురద నాకు కొత్తేం కాదు. కాళ్లకు అంటిన బురద కడుక్కునేందుకు నీళ్లు కావాలని అడిగా.మా కార్యకర్త నీళ్లు తెచ్చారు. ఆయన నీళ్లు పోస్తే నేనే నాకాళ్లను కడుక్కున్నాను’ అని మీడియా సమావేశంలో వెళ్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement