సాక్షి, ముంబై: విదర్భలో నామినేషన్ల ప్రక్రియ ఇంకా మందకొడిగానే కొనసాగుతోంది. శనివారంతో గడువు ముగియనుండటంతో ఆ రోజే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. కాగా, శుక్రవారం నాగపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ విలాస్ ముత్తెంవార్, భండారా-గోండియా నుంచి నానా పటోలే నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా రాంటెక్ లోకసభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ నామినేషన్ వేశారు. విదర్భలోని పది లోకసభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ పదవ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీని నిమిత్తం మార్చి 15వతేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. శనివారంతో నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియనుంది.
40కి పైగా నామినేషన్లు దాఖలు...?
విదర్భలోని పది లోకసభ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మొత్తం 40 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిసిం ది. ఇంకా చాలామంది నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఇక గురువారం వరకు అందిన వివరాల మేరకు మాత్రం 34 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నాగపూర్‌నుంచి ఎనిమిది, రాంటెక్‌నుంచి నలుగురు, అమరావతి నుంచి ముగ్గురు, వార్దా ఆరుగురు, యావత్మాల్-వాషిం నుంచి అయిదుగురు, గడ్‌చిరోలి-చిమూర్ ఇద్దరు, అకోలా, బుల్డానాల్లో ఒక్కొక్కరున్నారు.
నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న
ప్రముఖులు...
నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ఆప్ నాయకురాలు అంజలి దమానియా. భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ తదితరులున్నారు. కాగా, ప్రత్యేక విదర్భ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి.
విదర్భలో మందకొడిగా నామినేషన్లు
Published Fri, Mar 21 2014 10:31 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement