ఒంగోలు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు శనివారంతో గడువు ముగియనుంది. ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు 104 నామినేషన్లు, రెండు పార్లమెంట్ స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శనివారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరుకావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేకు భారీగా పోలీసులను మొహరిస్తున్నారు.
-అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 12న- 2, 15న-3, 16న-30, 17న- 69 నామినేషన్లు దాఖలయ్యాయి.
- పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఈనెల 12న-0, 15న-1, 16న-5, 17న-18 నామినేషన్లు దాఖలయ్యాయి.
-ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు దాదాపు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభ్యర్థులను మార్చడంతో శనివారం కొత్త అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
- బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ వరికూటి అమృతపాణి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- అద్దంకి, ఒంగోలు, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు శనివారం నామినేషన్ వేయనున్నారు.
- ఈనెల 17వ తేదీ నాటికి ఒంగోలు పార్లమెంట్‌కు 15 నామినేషన్లు, బాపట్ల పార్లమెంట్‌కు 9 నామినేషన్లు దాఖలయ్యాయి.
- అసెంబ్లీ స్థానాల వారీగా పరిశీలిస్తే యర్రగొండపాలెం-5, దర్శి-7, పర్చూరు-7, అద్దంకి-4, సంతనూతలపాడు-6, ఒంగోలు-7, కందుకూరు-9, కొండపి-7, మార్కాపురం-10, గిద్దలూరు-3, కనిగిరి-18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా డమ్మీ నామినేషన్లు దాఖలు చేశారు.
మూడు గంటల వరకే నామినేషన్ల స్వీకరణ:
నామినేషన్ల ప్రక్రియ శనివారం సాయంత్రం 3 గంటలకు ముగుస్తుంది. 21వ తేదీ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు పరిశీలిస్తారు. 23వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. మే 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16వ తేదీ ఓట్లు లెక్కిస్తారు.
నామినేషన్ల దాఖలుకు తుది గడువు నేడు
Published Sat, Apr 19 2014 4:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement