సాక్షి, గుంటూరు :జమిలి ఎన్నికలకు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు కావడంతో నామినేషన్ల దాఖలుకు అవకాశం లేదు. శనివారం మధ్యాహ్నంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. గురువారం గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలకు ఏడుగురు, 17 అసెంబ్లీ స్థానాలకు 67 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు ఎంపీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, బాలశౌరి సతీమణి భానుమతిలు నామినేషన్లు దాఖలు చేశారు. బాలశౌరి రెండుసెట్లు నామినేషన్ దాఖలు చేయగా, భానుమతి ఓ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి ఉదయకుమార్, బీఎస్పీ తరఫున మల్లెల బాబూరావు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వీర వరప్రసాద్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్య్ర అభ్యర్ధిగా కంతేటి నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. నరసరావుపేట ఎంపీ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా జంగాల సింగరయ్య నామినేషన్ వేశారు.
అసెంబ్లీ స్థానాలకు 67 నామినేషన్లు
అసెంబ్లీ స్థానాలకు 67 నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ, సత్తెనపల్లి టీడీపీ తరఫున కోడెల శివప్రసాద్, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు, తాడికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్‌కుమార్, వినుకొండ నుంచి కాంగ్రెస్ తరఫున మక్కెన మల్లికార్జునరావులు నామినేషన్ దాఖలు చేశారు.
పార్లమెంటుకు 7.. అసెంబ్లీకి 67
Published Fri, Apr 18 2014 1:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement