సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో త్వరలో ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే సంకేతాలిచ్చారు. ఆకస్మాత్తుగా పటోలే చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృíష్టించాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో దశలవారీగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు వెలువడగానే మార్చి పదో తేదీ తరువాత పెనుమార్పులు జరుగుతాయని భండార జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో నానా పటోలే వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీలతో చర్చలు జరిగాయన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులను బట్టి పార్టీకి మరమ్మతులు (ప్రక్షాళన) చేయాల్సిన సమయం వచ్చిందని వారు వ్యాఖ్యానించినట్లు పటోలే వివరించారు. దీంతో మార్చి పదో తేదీ తరువాత ఏం మార్పులు జరుగుతాయనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా మార్చి పదో తేదీన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతాయి. ఆ తరువాత బీఎంసీతోపాటు రాష్ట్రంలోని సుమారు 13 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూలు ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. అంతకు ముందే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారుచేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఇటువైపు ఉంది.
చదవండి: (వివాహ వేడుకల్లో విషాదం: 11 మంది మృతి.. మోదీ సంతాపం)
Comments
Please login to add a commentAdd a comment